ETV Bharat / jagte-raho

పెళ్లి పనులు చేసేందుకొచ్చి... మృత్యు ఒడికి చేరారు

పెళ్లి సంబరాలతో సంతోషాలు నిండాల్సిన వేళ అనుకోని ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. కామారెడ్డి జిల్లా చిన్నదేవాడలో ట్రాక్టర్‌ బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు. పెళ్లి ఇంటికి పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకొచ్చేందుకు వెళ్లి తిరిగివస్తుండగా ఘటన జరిగింది.

పెళ్లి పనులు చేసేందుకొచ్చి... మృత్యు ఒడికి చేరారు
పెళ్లి పనులు చేసేందుకొచ్చి... మృత్యు ఒడికి చేరారు
author img

By

Published : Dec 17, 2020, 5:04 PM IST

మూడు నిమిషాల్లో ఇంటికి చేరేవారు.. ఐదు గంటలు గడిస్తే పెళ్లి సంబరాల్లో మునిగిపోయేవారు. అంతలోనే ట్యాంకర్ రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. మూలమలుపు వద్ద అదుపుతప్పిన వాహనం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవడాలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. చిన్నదేవడాకు చెందిన రాజు... పెళ్లి కోసం వచ్చిన ఐదుగురు యువకులు గ్రామ పంచాయతీ ట్యాంకర్‌తో నీటిని తెచ్చేందుకు వెళ్లారు. సమీప వాగు నుంచి తిరిగి వస్తుండగా రహదారి మూల మలుపు వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్న దేవడాకు చెందిన తుకారాం, బిచ్కుందకు చెందిన సాయిలు, మద్నూర్‌కు చెందిన శంకర్‌లు మృత్యువాతపడ్డారు.

ప్రమాదంలో మృతి చెందిన మద్నూర్‌కు చెందిన శంకర్‌కు పాప, బాబు ఉండగా... అతని మరణంతో కుటుంబం తల్లడిల్లుతోంది. చిన్నదేవడాకే చెందిన తుకారాంకు నాలుగేళ్ల క్రితం పెళ్లయ్యింది. బిచ్కుందకు చెందిన సాయిలు స్థానికంగా దుస్తులు ఇస్త్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కొడుకులుండగా... అతని మృతితో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రమాద స్థలికి పెళ్లింటికి అరకిలోమీటరు లోపు దూరం ఉంటుంది. మూడు నిమిషాలు గడిస్తే ఇంటిని చేరుకునేవారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి చూసేందుకు వచ్చిన ముగ్గురు యువకులు మృత్యుఒడికి చేరడం చూసి బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.