హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో ఓ యువకుని మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుని జేబులో దొరికిన ఆధార్ కార్డ్ ఆధారంగా అతని పేరు షేక్ బిలాల్ హుస్సేన్(24)గా గుర్తించారు.
ప్రాథమిక ఆధారాలను సేకరించిన పోలీసులు షేక్ బిలాల్ హుస్సేన్ ఈ నేల 18 వ తేదీ విశాఖపట్నం నుంచి ఇండిగో విమానంలో హైద్రాబాద్ కు వచ్చినట్లు తెలిపారు. తమకు అందిన సమాచారం ప్రకారం బీటెక్ పూర్తి చేసిన అతను కొద్దిరోజులుగా ఉద్యోగం రాలేదనే మనోవేదనకు గురవుతున్నాడని.. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సదురు యువకుడు తన ఇంటిలో 'బై' అని రాసి పెట్టి వచ్చినట్టు తమకు తెలిసిందని తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అబిడ్స్‌లో అగ్నిప్రమాదం.. పది లక్షల వరకు ఆస్తి నష్టం