ETV Bharat / jagte-raho

నడికుడి ఎస్​బీఐ చోరీ కేసులో నిందితులు అరెస్ట్.. - గుంటూరు జిల్లాలో బ్యాంకు వార్తలు

వారిపై గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదు. అయితే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుంచి బయటపడేందుకు యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనానికి పాల్పడ్డారు ఆ యువకులు. ఏకంగా బ్యాంకుకే కన్నం వేశారు. ఏపీలోని నడికుడి స్టేట్ బ్యాంక్​లో చోరీకి పాల్పడి ఏకంగా రూ. 77 లక్షలను ఎత్తుకెళ్లారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ తెలంగాణకి చెందినవారిగా పోలీసులు తెలిపారు.

sbi
నడికుడి ఎస్​బీఐ చోరీ కేసులో నిందితులు అరెస్ట్..
author img

By

Published : Nov 28, 2020, 7:35 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నడికుడి స్టేట్ బ్యాంక్ చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 21న బ్యాంకుకు కన్నం వేసి రూ. 77 లక్షలు చోరీ చేశారు. పోలీసులు వెంటనే స్పందించి ఆధునిక సాంకేతికతో దొంగలను పట్టుకున్నట్లు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.

యూట్యూబ్‌ వీడియోలు చూసి

తెలంగాణాలోని మిర్యాలగూడకు చెందిన కేదారి ప్రసాద్, వినయ్ రాములుని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరికీ గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదని.. అయితే యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనానికి పాల్పడ్డారని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల నుంచి బయటపడేందుకు దొంగతనం చేసినట్లు నేరస్థులు చెప్పినట్లు తెలిపారు.

నడికుడి ఎస్​బీఐ చోరీ కేసులో నిందితులు అరెస్ట్..

దొంగతనం చేసిన వారు పట్టుబడకుండా సీసీ టీవీ వైర్లు కత్తిరించటం, మాస్కులు ధరించటం, ఘటనా స్థలంలో కారం చల్లటం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకోవటంతో పాటు చోరీ చేసిన రూ.77 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దేశంలో అత్యధిక బ్యాంకు దొంగతనాల్లో ఇదీ ఒకటని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గ్రేటర్‌ ఎన్నికల కోసం వెళ్తున్న బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.