రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడ గ్రామ సమీపంలో అతివేగంగా వెళ్తోన్న ఆర్టీసీ బస్సు.. కారును ఢీ కొట్టింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ డిపో బస్సు చేవెళ్ల నుంచి బయలుదేరి అప్పరెడ్డిగూడా సమీపంలో ఆగి ఉన్న ఆల్టో కారును అతి వేగంతో వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పిల్చుకున్నారు.
ఇవీ చూడండి : దుబ్బాక తహసీల్దార్ కారుకు అడ్డంగా పడుకొని నిరసన..