లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్లో రోడ్డు ప్రమదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ కంటే ముందు నిత్యం సగటున 12 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా.. ఇప్పుడా సంఖ్య ఒకటికి తగ్గినట్లు తాజాగా ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది.
ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల నివారణపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హాట్‌స్పాట్‌లను గుర్తించి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ కంటే ముందు(జనవరి 1 నుంచి మార్చి 21 వరకు).. ఆ తర్వాత(మార్చి 22-ఏప్రిల్ 22 వరకు) ప్రమాదాల తీవ్రతపై అధ్యయనం చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు క్షతగాత్రుల సంఖ్య భారీగా తగ్గినట్లు గుర్తించారు.