ETV Bharat / jagte-raho

అదుపు తప్పిన బైక్.. ఓ విద్యార్థి మృతి

ద్వి చక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కింద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

road accident in secendrabad near Jawahar nagar  police station
అదుపు తప్పిన బైక్.. ఓ విద్యార్థి మృతి
author img

By

Published : Feb 6, 2021, 4:07 PM IST

అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్​ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.

టిప్పర్ పై నుంచి దూసుకెళ్లడంతో..

అంబేడ్కర్ నగర్​కు చెందిన అభినవ్ అనే డిగ్రీ విద్యార్థి రాధికా థియేటర్ నుంచి సాకేత్ టవర్స్ వైపు బైక్​పై వస్తుండగా.. అదుపు తప్పి కింద పడినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ అభినవ్​పై నుంచి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన అభినవ్ అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ పరారైనట్లు తెలిపారు.

ఇదీ చదవండి: రుణాన్ని చెల్లించలేక ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.