మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలిక బుధవారం నిత్యావసరాల కోసం కిరాణ దుకాణానికి వెళ్లి వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి బాలికను అపహరించాడు.
బాలికను రమేష్.. తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రమేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. బాధ్యుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: పీఓకేలో ఆనకట్ట నిర్మాణంపై భారత్ తీవ్ర నిరసన