హైదరాబాద్ మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఫతుల్లా బేగ్ లైన్‌లోని ఓ ఇంట్లో బంగాల్‌కు చెందిన 16 మంది స్వర్ణకారులు పనిచేస్తున్నారు. రాత్రి ఘటన జరిగిన సమయంలో 13 మందికి గాయాలు కాగా మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
ఇదీ చూడండి: పాతబస్తీలో సిలిండర్ పేలుడు