కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో సాయంత్రం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించని, సరైన పత్రాలు లేని, మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురు వాహనదారులకు జరిమానాలు విధించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని, తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎస్సై మధుకర్ రెడ్డి పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.