హైదరాబాద్ కుస్లుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్జి మండి వద్ద ఈనెల 5న జరిగిన మర్డర్ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఒక ఆటో, ద్విచక్రవాహనంతో పాటు గొడ్డలి, వేట కొడవలి, కత్తినితో పాటు మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
తన మేనల్లుడైన ఇమ్రాన్‌ను చంపిన కేసులో అనుమానితుడుగా ఉన్న అబ్దుల్‌ను అక్బర్ సిద్ధికి విందుకు పిలిచాడు. ప్రణాళిక ప్రకారం మద్యం సేవించిన అనంతరం వారి వద్ద ఉన్న ఆయుధాలతో అబ్దుల్ ఖదీర్‌ను అతి దారుణంగా చంపి అక్కడి నుండి పరారయ్యారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను మొగల్ కానాల వద్ద పట్టుకున్నారు. ఏ1- అక్బర్ సిద్ధికి రౌడీ షీటర్ అని పోలీసులు తెలిపారు. అతనికి సహకరించిన సయ్యద్ ముల్తాని, సయ్యద్ సమీర్, అబ్దుల్ ఖదీర్‌ను కోర్టుకు తరలించారు.