హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపు ఘాట్ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగానే వారిపైనా రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ హోంగార్డు గాయపడ్డాడు. అతన్ని లంగర్ హౌస్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ఓ కేసుకు విషయంలో ఈ గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: భద్రతకు భరోసా.. ఈ వినూత్న ఆలోచన