ETV Bharat / jagte-raho

28 సంస్థలకు ఒకే పాన్​కార్డు, మెయిల్​... పేటీఎం ద్వారానే లావాదేవీలు - online betting news

ఆన్​లైన్​ జూదం ద్వారా వందల కోట్లు కొల్లగొట్టిన చైనా కంపెనీల కేసు దర్యాప్తులో ఆశ్చరకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులో పలు కీలక సమాచారం సేకరించారు. డోకీ పే, లింక్ యున్ సంస్థల ద్వారా ఏడు నెలల్లోనే 11 వందల కోట్ల లావాదేవీలు జరిగిన తీరుపై పరిశోధిస్తున్న ప్రత్యేక బృందం దిల్లీకి చెందిన రాహుల్ ముంజాల్ పేరును గుర్తించింది. ఒకే మెయిల్ ఐడీతో పలు డొల్ల కంపనీలు సృష్టించినట్లు గుర్తించారు.

online betting case updates
online betting case updates
author img

By

Published : Aug 21, 2020, 6:00 PM IST

వందల కోట్లకు సంబంధించి ఆన్​లైన్​ బెట్టింగ్ మాఫియాపై సైబర్ క్రైం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. 11 వందల కోట్ల నగదు లావాదేవీలను వేర్వేరు మార్గాల్లో తరలించేందుకు రాహుల్ ముంజాల్ అనే నిందితుడు.... యాన్‌హువోతో కలిసి డొల్ల కంపెనీలు సృష్టించాడు. ఇవన్నీ దిల్లీ, గుర్గావ్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల్లో 28 సంస్థలతో పాటు మరిన్ని కంపెనీలను నమోదు చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కంపెనీలకు సంబంధించి రాహుల్ ముంజాల్ పేరున్నా... ఫోన్ నంబరు, చిరునామా లేకపోవడం వల్ల వ్యక్తి ఉన్నాడా? యాహువో సృష్టించాడా? అని పోలీసులు పరిశోధిస్తున్నారు.

ఒకే పాన్‌కార్డు, మెయిల్, చిరునామాలు

డోకిపే, లింక్‌యున్ కంపెనీల పేర్లతో గుర్గావ్​లోని హెచ్డీఎఫ్​సీ బ్యాంక్​లో ఖాతా తెరిచేప్పుడు యానువో, అంకిత్​ మాత్రమే వెళ్లారని... రాహుల్ ముంజాల్ వెళ్లలేదని పోలీసులు తెలుసుకున్నారు. చైనీయులు డైరెక్టర్లుగా ఉన్న సంస్థల్లో వ్యవస్థాపకుడిగా రాహుల్ ముంజాల్ పేరుంది. రాహుల్ ముంజాల్ పేరున్న కంపెనీల జాబితాను పోలీసులు సేకరించగా ... పదికి పైనే ఉన్నాయని తెలిసింది. ఈ కంపెనీలు, సంస్థల్లో రాహుల్ ముంజాల్ పాన్ కార్డు, ఈ- మెయిల్, చిరునామా ఉంది. ఇన్ని కంపెనీలకు ఒకే పాన్‌కార్డు, మెయిల్, చిరునామాలున్నా.. బ్యాంకు అధికారులు, ఈ - వ్యాలెట్ సంస్థలకు అనుమానం రాలేదు. ఆయా కంపెనీల్లో ఎంత మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయాన్నది తెలుసుకునేందుకు పోలీసులు... బ్యాంకులు, ఈ - వాలెట్ సంస్థలకు లేఖలు రాశారు.

పేటీఎం ద్వారానే లావాదేవీలు....

జైల్లో ఉన్న నిందితులు యాహువో, ధీరజ్, అంకిత్, నీరజ్​లను కస్టడీకి తీసుకుని విచారించాకే ఇవన్నీ వివరంగా తెలిసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఫోన్​పే, మోబీక్విక్, గూగుల్​పే, మనీపే, రూపీ వంటి ఈ-వాలెట్ సంస్థలుండగా... చైనా కంపెనీలు డిజిటల్ నగదు బదిలీకి పేటీఎం సంస్థను మాత్రమే ఎంచుకున్నారు. మొత్తం 28 సంస్థలకు సంబంధించి డిజిటల్ నగదు స్వీకరణ, చెల్లింపులు పేటీఎం సంస్థ ద్వారానే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఒక్కోరోజు వేలసంఖ్యలో జరిగినట్టు రికార్డుల్లో ఉన్నాయి.

ఇదే విషయాన్ని పేటీఏం ప్రతినిధులను పోలీసులు ప్రశ్నించగా .. పర్ మినిట్ ట్రాన్​సాక్షన్స్ వేగం ఆధారంగా తమ సంస్థను యాహువో ఎంచుకున్నారని తెలిపారు. నిమిషానికి అత్యంత వేగంగా డిజిటల్ నగదు చెల్లింపులు, స్వీకరణ ఈ సదుపాయం ఉటుందని తెలిపారు. కరెంట్ ఖాతాలకు సంబంధించి డిజిటల్ చెల్లింపులపై ఆంక్షలు లేనందున తాము డోలీ పే, లింకయున్ కంపెనీలకు రుసుం తీసుకుని సేవలిందిస్తున్నామని వివరించారు.

ఇది చూడండి 'నాన్నా జాగ్రత్త.. ముద్దివ్వొద్దు, ముట్టుకోవద్దు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.