ETV Bharat / jagte-raho

సరోగసి పేరుతో సరసమాడాడు.. - latest crime news in Hyderabad

రాజధానిలో ఓ వినూత్న ఘటన వెలుగుచూసింది. సరోగసి సాకుతో... ఓ 64 ఏళ్ల వృద్దుడు.. 23 ఏళ్ల యువతిని బలవంతం చేయబోయాడు. ముగ్గురు ఆడపిల్లలకు తండ్రి అయిన నిందితుని తీరుపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. కొడుకును కనాలనే సాకుతో తన నీచబుద్ధి బయటపెట్టుకున్న.. ఆ ప్రబుద్ధుడు ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నాడు.

old man miss behave with lady in hyderabad
సరోగసి పేరుతో సరసమాడాడు
author img

By

Published : Feb 20, 2020, 3:37 PM IST

Updated : Feb 20, 2020, 5:30 PM IST

కృత్రిమ గర్భధారణ కోసం యువతితో ఒప్పందం కుదుర్చుకున్న ఓ వృద్ధుడు ఆ తర్వాత తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. తనతో సహజ సిద్దంగానే పిల్లల్ని కనాలని బలవంతం చేశాడు. ముసలోడి కుట్ర తెలుసుకున్న ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు స్వరూప రాజ్‌ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని అనంద్‌నగర్‌లో జరిగింది.

64ఏళ్ల వృద్దుడికి ముగ్గురు ఆడపిల్లలు..

స్థానికంగా నివాసముంటున్న స్వరూపరాజ్‌ అనే 64 ఏళ్ల వృద్దుడికి ముగ్గురు ఆడపిల్లలున్నారు. అయితే కొడుకు కావాలనే ఉద్దేశ్యంతో.. తన మిత్రుడైన నూర్​తో మధ్యవర్తిత్వం కుదుర్చుకున్నాడు. 23ఏళ్ల యువతితో కృత్రిమ గర్భధారణకు రూ.5లక్షలు ఇవ్వడానికి అంగీకరించాడు. వీటికి తోడు వైద్య ఖర్చుల నిమిత్తం నెలకు రూ.పదివేలు ప్రసవం జరిగేంత వరకు చెల్లిస్తాన్నాడు.

యువతిపై మోజు..

ఆ యువతిని చూసిన తర్వాత స్వరూపరాజ్ తన అసలు బుద్ధిని బయటపెట్టాడు. ఒప్పందం ప్రకారం కృత్రిమ గర్భధారణ కాకుండా నువ్వే కావాలని ఆ యువతిని ఇబ్బంది పెట్టాడు. వేధింపులను భరించలేని బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు స్వరూప రాజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సరోగసి పేరుతో సరసమాడాడు

ఇవీ చూడండి:'కాపీ కొట్టండి.. దొరికితే బుద్ధిగా ఉండండి'

Last Updated : Feb 20, 2020, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.