ETV Bharat / jagte-raho

పేగు బంధం మరిచి.. ప్రియుడితో కలిసి కన్నకొడుకునే చంపిన తల్లి - జగ్గయ్యపేటలో కుమారుడిని చంపిన తల్లి న్యూస్

ఓ తల్లి తన పేగు బంధాన్ని మరిచిపోయింది. రక్తమాంసాలు పంచి జన్మనిచ్చిన కుమారుడిని ప్రియుడి కోసం వద్దనుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఎలాగైనా .. తొలగించాలనుకుంది. కన్న బంధాన్ని మరిచి ప్రియుడితో కలిసి తన చిన్న కొడుకును దారుణంగా హత్య చేసింది.

mother-killed-her-yonger-son-in-krishna-district-jaggayyapeta
పేగు బంధం మరిచి.. ప్రియుడితో కలిసి కన్నకొడుకునే చంపిన తల్లి
author img

By

Published : Oct 7, 2020, 6:39 PM IST

ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో కన్నతల్లి ప్రియుడితో కలిసి కన్న కొడుకును హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. తన చిన్న కొడుకును ఎలాగైనా చంపాలనుకుంది ఉషా. ప్రియుడు శ్రీనుతో కలిసి పథకం రచించింది. రెండు రోజుల క్రితం కుమారుడిని చంపేసి.. గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణలోని కోదాడ వద్ద ఇద్దరూ కలిసి ఆ చిన్నారిని పూడ్చిపెట్టారు.

అనుమానం రావడం వల్ల స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కన్న తల్లిని, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అసలు నిజం బయటపెట్టారు. జగ్గయ్యపేట పోలీసులు తల్లి ఉషాను, ప్రియుడు శ్రీనును అరెస్ట్ చేశారు. ఉషా రెండు నెలల క్రితం భర్త నుంచి విడిపోయి ప్రియుడితో ఉంటోంది.

ఇవీ చూడండి: బుల్లెట్ మీద వస్తాడు... దృష్టి మరల్చి నగలు ఎత్తుకెళ్తాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.