హైదరాబాద్ ఖైరతాబాద్‌లో వ్యక్తి ఆత్మాహత్యాయత్నం చేశాడు. చేయి మనికట్టు కట్ చేసుకొని గదిలోకి వెళ్లి... తాళం వేసుకున్నాడు. ఎంత సేపటికి తలుపులు తీయకపోవడం వల్ల... కుటుంబ సభ్యులు సైఫాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. గది తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు... ఫ్యాన్‌కు ఉరి వేసుకొనేందుకు యత్నించిన ఆ వ్యక్తిని కాపాడారు.
చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్ శ్రీనివాస్... వ్యక్తి ప్రాణాలను కాపాడారు.