రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ఎల్వర్తి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మహారాష్ట్రకు చెందిన సికిందర్ సింగ్, అలీఖాన్ పటాన్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్... ఇద్దరు మృతి