ETV Bharat / jagte-raho

అక్రమార్కుల ఆగడాలు... పోలీసులపై దాడులు

author img

By

Published : Dec 25, 2020, 4:31 AM IST

Updated : Dec 25, 2020, 6:47 AM IST

కలకలం సృష్టించిన జవహర్‌నగర్‌ ఘటనలో కాలిన గాయాల పాలైన ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతి రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అక్రమ కట్టడాల కూల్చివేతకు బందోబస్తు నిమిత్తం వెళ్లిన సీఐ... ఆత్మహత్య ప్రయత్నం చేసిన దంపతులను రక్షించే క్రమంలో గాయపడ్డారు. ఊహించని విధంగా జరిగిన సంఘటనతో పోలీసు శాఖ ఉలిక్కిపడింది.

అక్రమార్కుల ఆగడాలు... పోలీసులపై దాడులు
అక్రమార్కుల ఆగడాలు... పోలీసులపై దాడులు
అక్రమార్కుల ఆగడాలు... పోలీసులపై దాడులు

అక్రమ కట్టడాలు కూల్చివేసే క్రమంలో మేడ్చల్​ జిల్లా జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావుకు నిప్పంటుకుని గాయాలయ్యాయి. మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లోని బాలాజీనగర్‌లో షీ టాయిలెట్ల కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జాదారులు ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన జవహర్‌నగర్‌ మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయించారు. ఇందుకోసం పోలీసు బందోబస్తు కావాలని కోరారు. సీఐ భిక్షపతిరావు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వయంగా ఆయన కూడా కూల్చివేతలు చేయనున్న ప్రాంతానికి వెళ్లారు. ఇది గమనించిన ఆక్రమణదారులు కూల్చివేతలు అడ్డుకోవడానికి యత్నించారు.

ముఖంపై కారం చల్లి..

ఇళ్లు కూల్చివేస్తే ఆత్మహత్య చేసుకుంటామని పూనంచంద్‌ అనే వ్యక్తి కుటుంబసభ్యులు అధికారులను తొలుత బెదిరించారు. టైర్లకు నిప్పంటించి ఎవరూ రాకుండా అడ్డుగా ఉంచారు. దంపతులు ఇతర కుటుంబసభ్యులు ఇంట్లోకి వెళ్లి లోపల నుంచి తలుపు బిగించుకున్నారు. లోనికి ఎవరైనా వస్తే ఆత్మహత్య చేసకుంటామని బెదిరించారు. ఎవరూ ఆత్మహత్యకు పాల్పడకుండా అడ్డుకుందామని ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు ఇంట్లోకి వెళ్లారు. లోపలికి వెళ్లిన వెంటనే భిక్షపతిరావు ముఖంపై కారం చల్లారు. ఈ సమయంలోనే సీఐకి మంటలు అంటుకోగా... కేకలు వేస్తూ బయటకు పరుగులు తీస్తు వచ్చి... ఒక్కసారిగా కింద పడిపోయారు. అక్కడున్న పోలీసు సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేశారు.

40శాతం గాయాలు

అప్పటికే ఇన్‌స్పెక్టర్‌ చేతికి, కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. మరో కానిస్టేబుల్‌కూ గాయాలు కావడం వల్ల... ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, రాచకొండ కమిషనర్‌ మహేశ్​ భగవత్‌... భిక్షపతిరావును పరామర్శించారు. ఆయనకు నలభై శాతం వరకు కాలిన గాయాలయ్యాయని మహేష్‌భగవత్‌ తెలిపారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉద్దేశపూర్వకంగానే చేశారా..?

ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసు అధికారులకు మంటలు అంటించారా.. లేదా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుందా అనేది విచారణలో తెలుస్తుందని చెబుతున్నారు.

ఇదీ చూడండి: ఉద్రిక్తతలకు దారితీసిన ఆక్రమణల కూల్చివేత

Last Updated : Dec 25, 2020, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.