గుర్తు తెలియని వాహనం ఢీకొని మాజీ సర్పంచి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులో జరిగింది. బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన మాజీ సర్పంచి మేకపోతుల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి తొర్రూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా... గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రవీందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.