ETV Bharat / jagte-raho

రాకేశ్​​రెడ్డికి అన్ని కోట్లు ఎక్కడివి?

ప్రముఖ వ్యాపారవేత్త, ప్రవాసభారతీయుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.  రెండో రోజు శిఖా చౌదరితో పాటు ప్రధాన నిందితుడు రాకేశ్​​రెడ్డి, అతనికి సహకరించిన శ్రీనివాస్​ను విచారించారు.

రాకేశ్​ రెడ్డిని ఇంట్లోకి తీసుకెళ్తున్న పోలీసులు
author img

By

Published : Feb 15, 2019, 5:57 AM IST

Updated : Feb 16, 2019, 11:27 AM IST

రాకేశ్​​రెడ్డికి అన్ని కోట్లు ఎక్కడివి
జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​​రెడ్డిని పోలీసులు రెండో రోజు ప్రశ్నించారు. అతనితోపాటు శిఖా చౌదరి, వాచ్​మెన్​ శ్రీనివాస్​ను కూడా విచారించారు. జయరాం, రాకేశ్ రెడ్డి మధ్య వ్యవహారాలకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరిని వేరువేరుగా ప్రశ్నించారు.
undefined

హత్య జరిగిన తీరును తెలుసుకునేందుకు పోలీసులు రాకేశ్​రెడ్డి, శ్రీనివాస్​ను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న ఇంటికి తీసుకెళ్లి పరిశీలించారు. హత్యకు ముందు చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగున్నర కోట్ల రూపాయల డబ్బు ఇచ్చే ఆర్థిక స్తోమత లేదని రాకేశ్​రెడ్డి చేతిలో మోసపోయిన శిఖాతోపాటు బాధితులు తెలిపారు. అసలు జయరాంకు డబ్బులు ఇచ్చారా లేదా అనేది ప్రశ్నగా మారింది. డబ్బులు ఇస్తే వాటిని ఎక్కడి నుంచి తెచ్చారనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలను పరిశీలించి.. నగదు లావాదేవీలు అంతంతమాత్రంగానే ఉన్నట్టు గుర్తించారు.

రాకేశ్​రెడ్డి నేరచరిత్రపైనా పోలీసులు దృష్టిసారించారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతల పేర్లు చెప్పి వ్యాపారులను భయపెట్టి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూకట్​పల్లి, జవహర్​నగర్ పోలీస్ స్టేషన్​లో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. హత్యలో ఇంకెవరైనా పాల్గొన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

sample description
Last Updated : Feb 16, 2019, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.