రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పరిధి శ్రీరామ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కత్తితో గొంతు కోసి.. అతి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా భయభ్రంతులకు గురిచేసింది.
అసలు వివరాలు...
భార్య వరలక్ష్మిని.. కత్తితో గొంతుకోసి... భర్త నాగరాజు పారిపోయాడు . నాగరాజుకు, వరలక్ష్మిలకు తరచూ గొడవలు అయ్యేవని... స్థానికులు చెబుతున్నారు. భర్త పెట్టే బాధలు భరించలేక... వరలక్ష్మి స్నేహితుల ఇళ్లలో తలదాచుకునేదని వెల్లడించారు. గత రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో వరలక్ష్మిని కత్తితో గొంత్తుకోసి... బయట తాళం వేసి పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... వరలక్ష్మి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు గతంలో చిన్న చిన్న దొంగతనాలతో పాటు హత్య కూడా చేశాడని నిందితుని బంధువులు అరోపిస్తున్నారు.