నిర్మల్ జిల్లా కేంద్రంలో రాజు అనే వృద్ధుడికి ఏడాది క్రితం భార్య మృతి చెందింది. అప్పటి నుంచి కుమారుడి వద్దనే ఉంటున్నాడు. కుమారుడు, కోడలు, మనవరాలు అందరితో కలిసి హాయిగా కాలం వెల్లదీయాల్సిన ఆ వృద్ధుడు దారి తప్పాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆరేళ్ల మనవరాలిపై అత్యాచారానికి యత్నించాడు.
అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన కోడలు మామ దురాగతాన్ని చూసి మండిపడింది. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో వృద్ధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ జాన్ దివాకర్ తెలిపారు.
ఇదీ చూడండి: 'ప్రియుడితో కలిసి అమ్మే నాన్నను చంపేసింది'