మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్‌పై పిండి వంటలు తయారు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ సిలెండర్ నుంచి గ్యాస్ లీకైంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో స్వామి, సందీప్, పద్మ, అనూషలు తీవ్ర గాయాలపాలయ్యారు.
సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు మంటలను ఆర్పేశారు. గాయపడిన బాధితులను ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: గ్యాస్ లీకై పూరిల్లు దగ్ధం.. కుటుంబసభ్యలు క్షేమం