రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధి పెద్ద అంబర్పేట్లోని బ్యాంకు కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న డెకరేషన్ సామగ్రి తయారీ కంపెనీ (బలరాంపాల్ ఫైబర్ వర్క్స్ )లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. డెకరేషన్ సామాగ్రి కావడంతో మంటలు వేగంగా విస్తరించాయి.
ప్రమాదాన్ని పసిగట్టిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. సూర్యుని ఎండ తీవ్రతకు మంటలు ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. ఆస్థినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.