ETV Bharat / jagte-raho

బెంగళూరు కేంద్రంగా దా'రుణా'లకు యత్నం.. నిందితులు అరెస్ట్​ - ఇన్​స్టంట్ లోన్ యాప్ తాజా వార్తలు

కొవిడ్​ నేపథ్యంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే.. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని దా'రుణా'లకు ఒడిగట్టారు కొందరు వ్యక్తులు. ఏ హామీ లేకుండా ఇన్​స్టంట్​గా ఆన్​లైన్​ ద్వారా అప్పిస్తామని చెప్పి.. తర్వాత ఆ సొమ్మును వసూలు చేసుకోవడం కోసం రుణ గ్రహీతలను మానసికంగా వేధింపులకు కూడా గురి చేశారు. ఈ నేపథ్యంలో 'ఇన్​స్టంట్' లోన్ యాప్ ద్వారా రుణాలిచ్చి ఘరానా మోసానికి పాల్పడుతున్న ముఠాలోని ముగ్గురిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

established company in banglore for instant loans 3 were arrested
బెంగళూరు కేంద్రంగా దా'రుణా'లకు యత్నం.. నిందితులు అరెస్ట్​
author img

By

Published : Dec 28, 2020, 10:01 AM IST

కొవిడ్ మహమ్మారి కారణంగా చాలామంది కొలువులు కోల్పోయి.. వేతనాల్లో కోత పడి అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో పడిపోయారు. తెలిసినవాళ్లనెవరినైనా అప్పు అడుగుదామన్నా.. ఇంచుమించు అందరిదీ ఇదే పరిస్ధితి. రోజు గడిచే మార్గం లేక ఆకలితో పస్తులుండలేక రుణ యాప్​లకు ఆకర్షితులవుతున్నారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని.. సంస్ధలు సదరు వ్యక్తులను పీల్చి పిప్పి చేస్తూ.. వేధింపులకు గురి చేసిన ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూశాయి. తాజాగా ముగ్గురు నిందితులను వరంగల్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.

జనగామ జిల్లాలో గుడ్లగడ్డ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు ఫాస్ట్ క్రెడిట్ యాప్​ ద్వారా రూ.4 వేలు రుణంగా పొందాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రుణం సకాలంలో చెల్లించలేకపోయాడు. ఫలితంగా ఫోన్​ ద్వారా వేధింపులకు గురయ్యాడు. బాధితుడి బంధుమిత్రుల ఫోన్ నంబర్లకు యాప్​ నిర్వాహకులు అభ్యంతరకరమైన సందేశాలను పంపించారు. దీంతో బాధితుడు జనగామ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా... వరంగల్ సైబర్ క్రైం, జనగామ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి బెంగళూరులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

బెంగళూరులో కంపెనీ పెట్టి

బెంగళూరుకు చెందిన దేబాశిస్ దాస్ గుప్తా, సంజయ్, సంతోష్ నాయక్, మరో ఇద్దరు ప్రధాన నిందితులు ఈ యాప్​ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరి నుంచి 3 సెల్ ఫోన్లు, 2 ల్యాప్ టాప్​లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపార వీసాపై గతేడాది ఇక్కడకు వచ్చిన చైనా దేశస్థుడు.. ఎర్రీక్ పెగ్లూ, ఒడిశాకు చెందిన పాడ్రా బ్రిన్​దాయ్​తో కలసి.. నాలుగు రకాల ఇన్ స్టంట్ యాప్ లోన్లను రూపొందించాడు. 'షైన్ బే టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్' పేరుతో బెంగళూరులో ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు.

అనంతరం వేధింపులు

పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితుల సహకారంతో.. ఫాస్ట్ క్రెడిట్ యాప్ ద్వారా ఇన్​స్టంట్ లోన్ మంజూరు చేయడం మొదలుపెట్టారు. అధిక వడ్డీలు, ఛార్జీల పేరుతో డబ్బుల వసూలు చేయడం.. ఇవ్వని వారిని వేధించడం, ఫోన్ల ద్వారా బెదిరించడం చేసేవారు. కుటుంబసభ్యులకు, మిత్రులకు, అభ్యంతరకర సందేశాలు పంపించడం మొదలైనవి చేస్తుండేవారని పోలీసులు తెలిపారు.

అప్రమత్తంగా ఉండండి

నిందితులను పట్టుకున్న పోలీసులను నగర పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ అభినందించారు. దారుణ మోసాలకు పాల్పడే ఇన్ స్టంట్ లోన్ యాప్ మాయలో పడవద్దని, అప్రమత్తంగా ఉండాలని నగర వాసులకు కమిషనర్​ సూచించారు. ఇన్​స్టంట్ రుణ యాప్​లపై అవగాహన కోసం రూపొందించిన సంక్షిప్త వీడియో సందేశాన్ని శనివారం విడుదల చేశారు.

ఇదీ చదవండి: అడ్డగోలుగా దోచుకుంటున్నారు.. అప్రమత్తంగా ఉండండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.