ETV Bharat / jagte-raho

కరోనా కాటేస్తున్నా.. హైదరాబాద్​లో డ్రగ్స్​ జోరు! - drugs case in hyderabad

ఐటీ, ఫార్మా రంగాలకు కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్‌... మత్తు మందుల సరఫరాకు అడ్డాగా మారింది. ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో పాశ్చాత్య పోకడలు కూడా అదే స్థాయిలో విస్తరిస్తున్నాయి. మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకుని కొనసాగిస్తున్న మత్తుమందుల దందా విచ్చలవిడి పరిస్థితులకు దారి తీస్తోంది. కరోనా మహమ్మారితో ప్రజలు విలవిలలాడుతున్న ఈ సమయంలోనూ.. హైదరాబాద్​లో మత్తుమందుల క్రయవిక్రయాలు జోరు తగ్గడం లేదు.

drugs bussiness in hyderabad explained full story
drugs bussinesకరోనా కటేస్తున్నా... హైదరాబాద్​లో డ్రగ్స్​ జోరు అంతకంతకూ పెరిగిపోతోందంటా!s in hyderabad explained full story
author img

By

Published : Aug 18, 2020, 10:05 PM IST

కరోనా కటేస్తున్నా... హైదరాబాద్​లో డ్రగ్స్​ జోరు అంతకంతకూ పెరిగిపోతోందంటా!

హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా మత్తుమందులు పట్టుబడుతూనే ఉన్నాయి. వ్యసనపరులుగా మారుతున్న యువతను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలు కట్టడికి పని చేస్తున్న ప్రభుత్వ ఏజన్సీల కళ్లుగప్పి అక్రమార్కులు తమ దందాలను కొనసాగిస్తునే ఉన్నారు. పర్యాటక ప్రాంతాలైన గోవా, సింగపూర్‌, మలేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌, లావోస్‌, ఇండోనేషియా, మాల్దీవులు, మయన్మార్‌, హాంగ్‌కాంగ్‌ లాంటి ప్రదేశాలకు వెళ్లిన యువత కొంత మంది సరదా కోసం తీసుకున్న డ్రగ్స్​కి అలవాటు పడుతున్నారు. అదే అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోంది.

అన్​లాక్​తో ఊపందుకున్నాయి...

ఆర్థిక పరిస్థితులు సహకరించక కొందరు ఆ డ్రగ్స్​ కోసం సరఫరా దారులుగా మారుతున్నారు. వాటిని విక్రయించే నైజీరియన్లతో కలిసి సరఫరా చేస్తూ ఈ రొంపిలో కూరుకుపోతున్నారు. కొవిడ్‌ నిబంధనలతో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నంతకాలం మత్తుమందుల సరఫరా కూడా పూర్తిగా ఆగిపోయింది. ఎప్పుడైతే లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించారో అప్పటి నుంచి మళ్లీ రాష్ట్రంలోకి మాదకద్రవ్యాలు ప్రవేశించాయి.

మాస్కుల వ్యాపారం మాటున మత్తుమందులు..

హైదరాబాద్‌కు చెందిన తరుణ్‌జ్యోతి సింగ్‌, అమిత్‌కుమార్‌లు మాస్కుల వ్యాపారం పేరుతో పోలీసుల అనుమతి తీసుకుని మరీ బెంగళూరు వెళ్లి కొకైన్​ తీసుకొచ్చారు. రూ. 2 లక్షలకు 70 గ్రాములు కొకైన్‌ కొనుగోలు చేశారు. గ్రాము కొకైన్‌ను ఏకంగా 10 నుంచి 12వేలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. విషయం బయటకు పొక్కగా... పోలీసులు తనిఖీలు నిర్వహించి 54 గ్రాముల మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు., తరుణ్‌జ్యోతి సింగ్, అమిత్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత తార్నాక కూడలి వద్ద జోడిపాస్కెల్‌, అతని ప్రియురాలు మోనికను అదుపులోకి తీసుకుని... వారి నుంచి 104గ్రాముల కొకైన్‌, లక్షా 64వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్​, ముంబయిలో వంద కోట్లకు పైగా...

తాజాగా హైదరాబాద్‌, ముంబయి నగరాల్లో మూడు రోజులపాటు విస్తృతంగా సోదాలు నిర్వహించిన డీఆర్‌ఐ అధికారులు వంద కోట్లకుపైగా విలువైన భారీ మొత్తంలో నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో 2017లో డ్రగ్స్​ అక్రమంగా సరఫరా చేస్తూ పట్టుబడి బెయిల్​పై విడుదలైన ప్రధాన సూత్రదారితోపాటు మరో ఇద్దరిని ముంబయిలో డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల హైదరాబాద్‌ నుంచి ముంబయికి ప్రైవేటు బస్సులో కార్గో పార్సిల్‌ ద్వారా మెఫెడ్రోన్‌ మత్తుమందును పంపించినట్లు డీఆర్‌ఐ అధికారులకు ఉప్పందింది. వెంటనే ముంబయి డీఆర్‌ఐ అధికారులను అప్రమత్తం చేయగా... ఆ పార్సిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానిపై ఉన్న చిరునామా ఆధారంగా చేసుకుని దాడులు నిర్వహించగా... పెద్ద ఎత్తున డ్రగ్స్​ పట్టుబడ్డాయి.

జిన్నారంలో ఓ పరిశ్రమలో...

జిన్నారం మండలంలో ఓ పరిశ్రమలో డీఆర్‌ఐ అధికారులు సోదాలు నిర్వహించగా.. రూ. 47 కోట్ల విలువైన 210 కిలోల మెఫెడ్రోన్‌, 10కిలోల కెటామైన్‌, 31 కిలోల ఎపిడ్రిన్‌తో పాటు రూ.50 కోట్ల విలువైన మెఫెడ్రోన్‌ తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్న 250 కిలోల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రదారి నుంచి రూ.45 లక్షలు ఇండియన్‌ కరెన్సీతోపాటు యూఎస్‌డీ, ఈయూఆర్‌ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఇందుకోసం 5 ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను విశ్లేషిస్తున్నారు. ఈ ముఠా నుంచి దేశంలో ఎక్కడెక్కడకి, ఏయే దేశాలకు మత్తుమందులు సరఫరా అయ్యాయన్న అంశంపై ఆరా తీస్తున్నాయి.

పెళ్లి కాని వాళ్లే విచ్చలవిడిగా...

కొన్ని వర్గాలకే పరిమితమైన మత్తుమందుల వాడకం క్రమంగా అన్ని వర్గాలకు వ్యాప్తి చెందుతోంది. హైదరాబాద్‌ నగరంలో బహుళ జాతి ఐటీ పరిశ్రమలు, ఫార్మా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల మత్తు మందుల సరఫరాకు అనువైన ప్రదేశంగా ముఠాలు రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లికాని యువతీయువకులు తల్లిదండ్రులకు దూరంగా ఉండడం.. ఆర్థిక పరిపుష్ఠితోపాటు పూర్తి స్వేచ్ఛ ఉండడం వల్ల వారాంతాల్లో పబ్‌లకు, క్లబ్‌లకు వెళ్లి ఈ మహమ్మారికి బానిసలవుతున్నారు. కొవిడ్‌ కారణంగా రవాణా పరిమితంగా ఉండడం, విద్యాసంస్థలు పూర్తిగా మూసి వేసి ఉండడం, బహుళ జాతి సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు సైతం ఇంటి దగ్గర నుంచే పని చేస్తుండటం వల్ల మత్తుమందులకు డిమాండ్‌ తగ్గినట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.

అప్రమత్తమైనా లాభం శూన్యం...

కానీ.. గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతున్న మత్తుపదార్థాలకు డిమాండ్‌ అధికంగా ఉంటోంది. మూడేళ్ల కిందట నగరంలో వెలుగు చూసిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. అప్పట్లో సినీ పరిశ్రమకు చెందిన డజను మంది వాడకందార్లను అబ్కారీ శాఖ విచారించింది. నైజీరియన్లే డ్రగ్స్‌ సరఫరాదారులుగా తేల్చిన అధికారులు... ఇప్పటికీ ఆ కేసులో ఏలాంటి పురోగతి సాధించలేదు. ఆ కేసు తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నిఘా సంస్థలు అప్రమత్తం కాగా... కొంతకాలం డ్రగ్స్‌ సరఫరా ముఠాలు స్తబ్దుగా ఉండి తిరిగి చెలరేగిపోతున్నాయి. బెంగుళూరు, గోవా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ నగరానికి అక్రమంగా తరలిస్తున్న ముఠాలు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నాయి.

ఇదీ చూడండి: పురపాలక శాఖ అధికారులు బాగా పనిచేశారు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.