శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 26 లక్షల విలువైన 809 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో అధికారులు బుధవారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వారి వస్తువులను తనిఖీ చేశారు. ఓ ప్రయాణికుడి వస్తువులను స్కాన్ చేయగా బంగారం ఉన్నట్లు గుర్తించారు.
పాప్‌కార్న్ తయారీ ఉపకరణంలో
ఎవ్వరికీ అనుమానం రాకుండా పాప్‌కార్న్ తయారీ ఉపకరణంలో అడుగు భాగాన దాచిన బంగారాన్ని గుర్తించారు. దాన్ని వెలికి తీసి స్వాధీనం చేసుకున్నారు. మాయగాళ్లు ఎన్ని కొత్త మార్గాలు అన్వేషించి మోసాలకు ప్రయత్నించినా పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు.
ఇవీ చదవండి:కోటి రూపాయల డ్రగ్స్ పట్టివేత