ETV Bharat / jagte-raho

మెయిల్ ఐడీ హ్యాక్ చేసి 8 లక్షలు స్వాహా

సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆ మోసగాళ్లు అమాయకుల జేబులకు చిల్లు పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్​కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి 14.3 లక్షలు కాజేశారు. తెలుసుకున్న బాధితులు సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Dec 13, 2020, 5:36 AM IST

cyber-hackers-mail-id-hacked-and-8-lakh-cheating
మెయిల్ ఐడీ హ్యాక్ చేసి 8 లక్షలు స్వాహా

సైబర్ నేరగాళ్లు హ్యాక్​ చేసి రూ.14.3 లక్షలు దోచుకున్నారు. సికింద్రాబాద్​కి చెందిన డాక్టర్ అర్జున్ రావు ఇంటర్నెట్ బ్యాంక్​తో లింకై ఉన్న మెయిల్ ఐడీని హ్యాక్ చేసి 8 లక్షలు సైబర్ చీటర్స్ కాజేశారు.

మరో కేసులో కాచిగూడకి చెందిన శేషగిరిరావు తన క్రెడిట్ కార్డ్ బిల్లు ఆన్​లైన్​లో కట్టే సందర్భంలో ఓ యాప్ డౌన్​లోడ్​ చేశాడు. దీంతో తన అకౌంట్​లో ఉన్న 6.3 లక్షల రూపాయలు మాయమయ్యాయి.

మోసపోయామని తెలుసుకున్న ఇద్దరు బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈ మెయిల్ లింక్ ఉన్న వినియోగదారులు మెయిల్​కి వచ్చే ఓటీపీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి : ఓఆర్‌ఆర్‌పై బస్సు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.