ETV Bharat / jagte-raho

ఐపీఎల్​ క్రికెట్​ ముఠా అరెస్టు... లక్షా 20 వేల నగదు స్వాధీనం - cricket betting in mahaboobnagar

మహబూబాబాద్​లో క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడుతున్న 10 మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి లక్షా 20 వేల నగదు, 10 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురిని త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.

cricket betting gang arrested in mahaboobnagar

author img

By

Published : Oct 16, 2020, 7:32 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడుతున్న 10 మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి లక్షా 20 వేల నగదు, 10 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు వ్యక్తులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. బెట్టింగ్​ల వైపు ఆకర్షితులవుతున్న 12 మంది యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు.

ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ క్రికెట్ బెట్టింగ్, జిల్లా కేంద్రాలు పాకిందని... గ్రామాలకు పాకే అవకాశం ఉందన్నారు. ఓవైపు ఆన్​లైన్​లో మరోవైపు మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా బెట్టింగ్​లకు పాల్పడుతున్నారని... ఎవరికీ అనుమానం రాకుండా మెడికల్ ఏజెన్సీలో నడుపుతున్నట్లు వెల్లడించారు. గూగుల్ పే, పేటీఎం ద్వారా నగదును ట్రాన్స్​ఫర్ చేస్తున్నారని తెలిపారు.

కుటుంబ సభ్యులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ఇంట్లో నగదు మాయమైతే వెంటనే గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు.

ఇదీ చూడండి: సన్నిహితులకు సందేశం పంపి.. దంపతుల ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.