ETV Bharat / jagte-raho

కన్నతల్లా.. కసాయా..! రోడ్డుపై పసికందును వదిలేసింది..

కన్న బిడ్డని కనికరం లేకుండా పుట్టిన వెంటనే రహదారి పక్కన పడేసిన ఓ తల్లిపై సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆడబిడ్డ వద్దని ఆమె చెప్పడం వల్ల పసికందును శిశుగృహానికి తరలించారు.

born baby on road side in sangareddy district
కన్నతల్లా.. కసాయా..! రోడ్డుపై పసికందు వదిలివేత
author img

By

Published : Oct 3, 2020, 8:04 PM IST

ఆడపిల్లగా పుట్టడమే ఆ పసిపాప చేసిన నేరమా..!... పుట్టిన వెంటనే ఆ పసికందును కన్నపేగన్న కనికరం లేకుండా రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది ఓ కసాయితల్లి. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 1వ తేదీన లింగంపల్లికి చెందిన లక్ష్మి అనే మహిళ మధ్యాహ్న సమయంలో ప్రసవానికి చేరింది. పాపను ప్రసవించిన తరువాత ఒకరోజు ఉండాలని వైద్యులు చెప్పినా రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఎవరికీ తెలియకుండా తల్లితో కలిసి వెళ్లిపోయింది. మరునాడు రామచంద్రాపురం మండలం ఎమ్ఐజీ మాక్స్ సొసైటీ సమీపంలో రహదారి పక్కన పాపను వదిలివెళ్లింది.

స్థానికులు సమాచారం మేరకు రామచంద్రాపురం పోలీసులు ఆడశిశువుని పరిశీలించారు. చేతికి ఉన్న ట్యాగ్ సహాయంతో పటాన్​చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో విచారించగా పసిపాప తల్లి లక్ష్మి వివరాలు తెలిశాయి. ఆమెను గుర్తించిన పోలీసులు విచారించగా తనకు కూతురు వద్దని చెప్పటం వల్ల స్థానిక ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. వారు శిశువుని సంగారెడ్డి శిశుగృహానికి తరలించారు. శిశువును బయట వదిలి పెట్టినందుకు తల్లి లక్ష్మిపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.