జనగామ పట్టణానికి చెందిన చింతకింది నివాస్, చింతకింది సిద్ధిరాములు, రాపోలు సందీప్ ముఠాగా ఏర్పడి జిల్లాలో ద్విచక్రవాహనాలు దొంగిలించేవారు. ఈ ముగ్గుర్ని పట్టణంలోని వీవర్స్కాలనీ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముఠా సభ్యుల నుంచి రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఆరు టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జనగామ సీఐ మల్లేశ్ తెలిపారు. వీరిని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. కొంతకాలంగా చేర్యాల, ఆలేరులో ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రాజేశ్ నాయక్, ఇతర పోలీసు సిబ్బందిని సీఐ మల్లేశ్ అభినందించారు.