ETV Bharat / jagte-raho

ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అరెస్ట్ - తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ హఫీజ్‌పేట్‌లో రూ.2వేల కోట్లు విలువ చేసే భూమి కోసమే.. ముగ్గురు వ్యాపారుల కిడ్నాప్‌ జరిగిందని పోలీసులు గుర్తించారు. ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌, ఎ.వి. సుబ్బారెడ్డిని నిందితులుగా చేర్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. హఫీజ్‌పేట భూములు తమ నాన్న భూమా నాగిరెడ్డి కొన్నారని.... తమకి తిరిగి ఇచ్చేయాలని ప్రవీణ్‌రావు సోదరుల్ని అఖిలప్రియ బెదిరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వారు వినకపోవడంతోనే అపహరణకు యత్నించారని తేల్చారు.

akhila priya arrest in praveen rao kidnap case at Hyderabad
ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో అఖిల ప్రియా అరెస్ట్
author img

By

Published : Jan 7, 2021, 4:23 AM IST

Updated : Jan 7, 2021, 4:40 AM IST

హైదరాబాద్‌లో ముగ్గురు వ్యాపారుల కిడ్నాప్‌ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, తెదేపా నాయకురాలు భూమా అఖిలప్రియ, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఆ పార్టీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. మియాపూర్‌ సమీపంలోని హఫీజ్‌పేటలో రూ.2 వేల కోట్ల విలువైన 48 ఎకరాల వివాదాస్పద భూమి వ్యవహారంలో ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావులను మంగళవారం రాత్రి కిడ్నాప్‌ చేయించారన్న ఫిర్యాదుపై ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2గా అఖిలప్రియ, ఏ3గా ఆమె భర్త భార్గవరామ్‌లపై కేసు నమోదు చేశామని కొత్వాల్‌ అంజనీకుమార్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏ1, ఏ2లను అరెస్టు చేశామని, భార్గవరామ్‌ పరారీలో ఉన్నాడని తెలిపారు. కిడ్నాప్‌ చేసిన వారిలో శ్రీనివాస్‌ చౌదరి అలియాస్‌ గుంటూరు శ్రీను, సాయి, చంటి, ప్రకాష్‌లున్నారని, వారినీ అరెస్టు చేస్తామన్నారు. కిడ్నాప్‌ జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై అన్వేషణ ముమ్మరం చేయడంతో నిందితులు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు కోకాపేట-నార్సింగి రహదారిలో బాధితులను వదిలిపెట్టి పారిపోయారని వివరించారు. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి..

ఆదాయపు పన్ను అధికారులమంటూ..

బోయిన్‌పల్లిలోని మనోవికాస్‌నగర్‌లో ఉంటున్న ప్రవీణ్‌, నవీన్‌, సునీల్‌లను బెదిరించి భూమి హక్కులను రాయించుకునేందుకు ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ పథకం రచించారు. వారి అనుచరులకు ఆదాయపు పన్నుశాఖ, పోలీసు అధికారులుగా వేషాలు వేయించారు. సుమారు 15 మంది నకిలీ గుర్తింపు కార్డులు ధరించి మూడు కార్లలో మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రవీణ్‌రావు నివాసానికి వెళ్లారు. ఐటీ అధికారులమంటూ నకిలీ సెర్చి వారెంట్లు చూపించారు. సోదాల మిషతో మహిళలు, పిల్లలను ఒక గదిలో ఉంచి తాళం వేశారు. అనంతరం ప్రవీణ్‌రావు సహా ముగ్గురినీ బెదిరించి కార్లలో తీసుకెళ్లారు. గంటసేపైనా అలికిడి లేకపోవడంతో ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యులు పక్క ఫ్లాట్‌లో వారికి ఫోన్‌ చేయగా.. ఓ మహిళ వచ్చి తాళం తీశారు. ప్రవీణ్‌, నవీన్‌, సునీల్‌ కనిపించకపోవడంతో వారు భయాందోళనలకు గురయ్యారు.

పాదచారుడు ఇచ్చిన సమాచారంతో..

కిడ్నాప్‌ చేసి కార్లలో తీసుకెళ్తుండగా, రాణిగంజ్‌ వద్ద ప్రవీణ్‌ గట్టిగా కేకలు వేయడంతో ఓ పాదచారి అనుమానించి డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. దీంతో ఉత్తర మండలం పోలీసులు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ప్రధాన కంట్రోల్‌ రూంలను అప్రమత్తం చేశారు. ఈలోగా మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత బోయిన్‌పల్లి పోలీసులకు ఫోన్‌ చేసి ప్రవీణ్‌రావు ఇంట్లో ఏదో జరుగుతోందని చెప్పారు. ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్‌ శింగన్వార్‌ వెళ్లి బాధితుల కుటుంబ సభ్యులతో చర్చించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 15 బృందాలను ఏర్పాటు చేశారు.

ఎనిమిది గంటలు కార్లలోనే...

కిడ్నాపర్లు బాహ్యవలయ రహదారి మీదుగా బాధితులను మహారాష్ట్రకు తరలించాలనుకున్నారు. పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడంతో రాత్రంతా బాహ్యవలయ రహదారులపైనే సంచరించారు. చివరకు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు నార్సింగి-కోకాపేట మార్గంలో బాధితులను వదిలేయగా, పోలీసులు సురక్షితంగా ఇంటికి చేర్చారు.

అఖిలప్రియ విచారణ.. వైద్యపరీక్షలు

బాధితులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు బుధవారం ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న భూమా అఖిలప్రియ ఇంటికి వెళ్లారు. ఆమెను, ఆమె తమ్ముడు జగద్విఖ్యాత్‌లను బోయిన్‌పల్లి పోలీస్‌ ఠాణాకు తరలించారు. అఖిలప్రియకు గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మాదాపూర్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్న ఏవీ సుబ్బారెడ్డిని బుధవారం రాత్రి ఏడు గంటలకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

సంబంధిత కథనాలు:

Last Updated : Jan 7, 2021, 4:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.