ETV Bharat / jagte-raho

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం.. చివరికి! - తెలంగాణ వార్తలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. మిషన్​ తెరవడానికి ప్రయత్నించిన సదరు దొంగ... ఆలారం మోగడంతో పరారయ్యాడు.

Breaking News
author img

By

Published : Dec 31, 2020, 4:53 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి కాలనీలో ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. సీసీటీవి పుటేజీలో ఆ దృశ్యాలు రికార్డ్​ అయ్యాయి. గుర్తు తెలియని దుండగుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెందిన ఏటీఎంలోకి తెల్లవారుజామున వెళ్లాడు.

ఆలారం మోగింది..

తన వెంట తీసుకువచ్చిన స్క్రూ డ్రైవర్‌తో ఏటీఎం యంత్రాన్ని తెరవడానికి ప్రయత్నం చేయగా.. అదే సమయంలో ఆలారం మోగింది. ఈ ఊహించని పరిమాణంతో కంగుతిన్న దుండగుడు ఆక్కడి నుంచి పరారయ్యాడు. ఏటీఎం చోరీ యత్నానికి గురైందని గమనించిన ఆ బ్యాంకు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: జనవరిలోనే పదోన్నతులు, వేతన సవరణ: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.