నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సోయా, మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి కాంగ్రెస్ భవన్ నుంచి ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల తీరు పట్ల నాయకులు అసహనం వ్యక్తం చేశారు. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోందని విమర్శించారు. సోయా, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని.. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మనల మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇంఛార్జ్ తహెర్ బిన్, ముప్ప గంగారెడ్డి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. చాలా రోజుల తర్వాత యాదాద్రిలో భక్తుల రద్దీ