తెలంగాణ- ఆంధ్రప్రదేశ్- చత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో విధుల నిమిత్తం వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనం ప్రమాదానికి గురైంది. భద్రాచలం నుంచి చత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా కుంటలో ఉన్న 217 బెటాలియన్ క్యాంపునకు వెళ్తుండగా... ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా చట్టి గ్రామ సమీపంలో సీఆర్పీఎఫ్ వాహనం... ప్రమాదవశాత్తు ట్రాక్టర్ను ఢీకొట్టటం వల్ల ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు సీఆర్పిఎఫ్ జవానులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఒక జవానుకు శస్త్ర చికిత్స నిర్వహించి ఓ కాలును తీసివేశారు. మరో జవాను పరిస్థితి విషమంగా ఉండటం వల్ల హైదరాబాద్కు తరలించారు.