వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలంలోని కొనాయమాకుల ఎత్తిపోతల పథకం వద్ద పిల్లరు పొస్తుండగా ప్రమాదం జరిగింది. సెంట్రింగ్ కూలిన ఘటనలో దినసరి కూలీలు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది కూలీలు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు, కూలీలు ఆరోపించారు.
ఇదీ చదవండి: నిశ్చితార్థం మరుసటి రోజే... శవమై తేలింది!