ETV Bharat / jagte-raho

విషాదం: కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలో పడి యువకుడు మృతి

కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ముఖం కడుక్కునేందుకని కాలువలో దిగి.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయి ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

A young man fell into the canal of the Kaleswaram project and died
విషాదం: కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలో పడి యువకుడు మృతి
author img

By

Published : Sep 1, 2020, 6:44 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపూర్​లో విషాదం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలో పడి కిరణ్​కుమార్​ అనే యువకుడు మృతి చెందాడు.

హైదరాబాద్ బాల్​నగర్​లోని ఫిరోజ్​గూడకు చెందిన ఎడ్ల కిరణ్ కుమార్ అతని మిత్రుడు కృష్ణ దురాయ్​తో కలిసి మోటర్ సైకిల్​పై యాదగిరిగుట్టకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వెంకటాపుర్​-తుర్కపల్లి మార్గమధ్యలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ వద్ద కాసేపు ఆగారు. ఈ క్రమంలో కిరణ్ ముఖం కడుక్కునేందుకని కాలువలో దిగి.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన కృష్ణ మిత్రుడిని కాపాడాలని కేకలు వేసినా చుట్టు పక్కల ఎవరూ లేకపోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అగ్ని మాపక​ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి.. ఓవర్​టేక్​ చేయబోయి.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.