యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగిబావికి చెందిన రాంపాక పోతయ్య (70) గేదెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం గేదెలను మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికొచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. మృతుడికి ఇద్దరు భార్యలు, ముగ్గురు బిడ్డలు, నలుగురు కొడుకులు ఉన్నారు.
ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!