జనగామ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో ఎవరు లేని సమయం చూసి.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 8ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని పలువురు పని నిమిత్తం ఇళ్లకు తాళం వేసి వేరే ఊళ్లకు వెళ్లారు. ఉదయం పూట ఆయా ఇళ్లను గమనించిన దుండగులు.. ఆ మేరకు టార్గెట్ చేసుకొని అర్ధరాత్రి సమయంలో ఆ ఇళ్లలోకి దూరారు. రూ. 70వేల నగదుతో పాటు పలు బంగారం, వెండి ఆభరణాలను కాజేశారు.
తాళం పగిలి ఉండటం గమనించిన ఇరుగుపొరుగు వారు.. అనుమానంతో యజమానులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. క్లూస్‌టీమ్‌తో దర్యాప్తు మొదలుపెట్టారు.
జనగామ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ వినోద్ ఘటనా స్థలానికి వెళ్లి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఊరెళ్లిన యువతి.. ఇల్లు గుల్ల చేసిన దొంగలు