ETV Bharat / jagte-raho

ట్రాక్టర్​ రోటోవేటర్​లో చిక్కుకుని వ్యక్తి మృతి - నర్సంపేటలో రోటోవేటర్​ కింద పడి వ్యక్తి మృతి

వరంగల్‌ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరంలో విషాదం చోటుచేసుకుంది. పత్తి చేనును ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా... ఓ వ్యకి ప్రమాదవశాత్తు రోటోవేటర్‌ బ్లేడులో చిక్కుకుని మృతిచెందాడు.

ట్రాక్టర్​ రోటోవేటర్​లో చిక్కుకుని వ్యక్తి మృతి

author img

By

Published : Jan 8, 2021, 8:06 AM IST

పత్తి చేనులో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్​ రోటోవేటర్​ బ్లేడులో చిక్కుకుని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్​ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరంలో జరిగింది. గ్రామానికి చెందిన పరశునాయక్‌... తండా శివారులోని తన పొలంలో పత్తిచేనులో ట్రాక్టర్‌తో దుక్కి చేయిస్తుండగా.... డ్రైవర్‌ పక్కనే కూర్చున్న చిన్న బయ్యన్న ప్రమాదవశాత్తు జారిపడి రోటోవేటర్ బ్లేడులో చుట్టుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె వివాహం ఇటీవల చేశాడని స్థానికులు తెలిపారు. బయ్యన్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి: వెంచర్​లో దొంగల బీభత్సం... సెక్యూరిటీ గార్డులను కొట్టి దోపిడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.