ETV Bharat / jagte-raho

ఆ కోరిక తీర్చకపోతే.. నీ ఉద్యోగం తీసేస్తా...

ఓ వైకాపా నాయకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోరిక తీర్చకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా పెద్ద పంజానీ మండలంలో జరిగింది.

కోరిక తీర్చలేదో ఉద్యోగం పోతుంది... వాలంటీర్​కు వైకాపా నేత బెదిరింపు

author img

By

Published : Sep 18, 2020, 6:14 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా పెద్ద పంజానీ మండలానికి చెందిన వైకాపా నాయకుడు శ్రీనివాసులుపై స్థానిక పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. శ్రీనివాసులు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా వాలంటీర్ ఫిర్యాదు చేసింది. కోర్చిక తీర్చకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరింపులకు దిగాడని బాధితురాలు వాపోయింది. దీనిపై ఆధారాలతో సహా మహిళా వాలంటీర్ ఫిర్యాదు చేయగా... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వైకాపా నాయకుడు శ్రీనివాసులు
వైకాపా నాయకుడు శ్రీనివాసులు

మండల కార్యాలయంలో వైకాపా నేత శ్రీనివాసులు జులుం ప్రదర్శిస్తున్నాడని కొందరు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో అధికారిక కార్యక్రమాలలో సైతం పాల్గొని...పెత్తనం చలాయిస్తున్నాడని చెప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమనే బెదిరిస్తున్నాడని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్​ నాయకుల అరెస్ట్​: పంజాగుట్ట నుంచి గోషామహల్​కు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.