మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజాపురం గ్రామానికి చెందిన అక్కిరెడ్డి సత్తిరెడ్డి అనే రైతుకు గ్రామ శివారులోని సర్వే నంబరు 529లో 3.36 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు సైతం పొందారు. గత కొన్నేళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ భూమి తమదేనంటూ తప్పుడు పత్రాలు సృష్టించాడని సత్తిరెడ్డి తెలిపారు. ఆ నకిలీ పత్రాలతో ఆర్డీవోకు అప్పీలు చేయగా. ఆర్డీవో సదరు వ్యక్తికే అనుకూలంగా తీర్పు ఇవ్వడం వల్ల తనకు అన్యాయం జరిగిందని బాధితుడు సత్తిరెడ్డి ఆరోపించారు.
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న తన భూమిని ఇతరులకు దక్కేలా తీర్పునివ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని కోరుతూ.. కుటుంబ సభ్యులతో కలిసి పురుగుల మందు డబ్బాతో రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చూడండి: 'మరీ ఇంత దారుణమా... డబ్బు కట్టేవరకు చనిపోయారనే చెప్పరా..?'