ETV Bharat / jagte-raho

కిటికీ చువ్వలు తొలగించి.. బాలుర పరారీ - వరంగల్​ జిల్లా నేర వార్తలు

వరంగల్​ జిల్లా ఆటోనగర్​లోని బాలుర పరిశీలక గృహం నుంచి ఇద్దరు పిల్లలు తప్పించుకున్నారు. ఇందులో ఒకతను ఇదివరకే పరిశీలన గృహం నుంచి పారిపోగా.. పోలీసులు గాలించి అధికారులకు అప్పగించారు. ఇప్పుడు అదే బాలుడు మరో బాలుడితో కలిసి పరారయ్యాడు. వెళ్తూ వెళ్తూ అధికారులకు ఓ సందేశం కూడా ఇచ్చాడు.

కిటికీ చువ్వలు తొలగించి.. బాలుర పరారీ
కిటికీ చువ్వలు తొలగించి.. బాలుర పరారీ
author img

By

Published : Dec 13, 2020, 4:09 PM IST

తెలిసి తెలియని వయసులో చోరీలు చేసి బాలుర పరిశీలక గృహానికి వచ్చాడు. ఇదే గృహం నుంచి 16 రోజుల క్రితం రాజమండ్రికి పారిపోయాడు. పోలీసులు గాలించి అధికారులకు అప్పగించారు. అనంతరం పారిపోయిన సదరు బాలుడిని ప్రత్యేక గదిలో ఉంచారు. అదే బాలుడు మళ్లీ పారిపోతూ 20 రోజుల్లో తిరిగి వస్తాను సార్‌ అంటూ సంబంధిత అధికారికి గోడ మీద సందేశం రాసి మళ్లీ పరారీ అయ్యాడు. ఈసారి మరో బాలుడిని వెంట తీసుకెళ్లడం అధికారులను కలవరానికి గురిచేస్తోంది. ఈ ఘటనపై బాలుర పరిశీలక గృహం అధికారి ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇద్దరికి మెమోలు జారీ చేశాం

పరిశీలక గృహం నుంచి ఇద్దరు బాలల పరారీపై విచారణ చేస్తున్నాం. ఇద్దరు సూపర్‌వైజర్లకు మెమోలు జారీ చేశాం. పరారీకి గల కారణాలను తెలుసుకోవడానికి బాలుర పరిశీలక గృహం అదనపు పర్యవేక్షణ అధికారిణి శ్రీదేవిని విచారణ అధికారిగా నియమించాం. నివేదిక ఆధారంగా సిబ్బందిపై చర్యలు తీసుకొని, భద్రతను మరింత పెంచుతాం. - సంగమేశ్వర్‌, సూపరింటెండెంట్‌.

ఇవీ చూడండి: తాళంవేసున్న కార్యాలయాలే లక్ష్యం... నిమిషాల్లో సొత్తుమాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.