ETV Bharat / jagte-raho

సీఐపై దాడి ఘటనలో 16 మంది అరెస్టు

author img

By

Published : Dec 27, 2020, 5:36 PM IST

జవహర్​నగర్ ఇన్‌స్పెక్టర్ బిక్షపతిరావుపై దాడి ఘటనలో 16 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 24న జవహర్‌నగర్‌లోని సర్వే నెంబర్ 432లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు.. అధికారులతోపాటు అక్కడికి వెళ్లిన సీఐపై స్థానికులు దాడికి దిగారు.

16 people arrested in jawahar nagar attack on CI bikshapathi
సీఐపై దాడి ఘటనలో 16 మంది అరెస్టు

జవహర్​నగర్ ఇన్‌స్పెక్టర్ బిక్షపతిరావుపై దాడి ఘటనలో 16 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 24న జవహర్‌నగర్‌లోని సర్వే నెంబర్ 432లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు.. మున్సిపల్ అధికారులతోపాటు అక్కడికి వెళ్లిన సీఐ బిక్షపతిరావుతోపాటు.. ఇతర పోలీసు సిబ్బందిపై పూనమ్‌ చంద్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు కళ్లల్లో కారం చల్లుతూ దాడికి పాల్పడ్డారు.

ఆ ఘటనలో సీఐ బిక్షపతిరావు 40 శాతం కాలిన గాయాలతో సికింద్రాబాద్​ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడికి పాల్పడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని రిమాండ్​కు తరలించారు. ఈ కేసులో మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చూడండి : 14 ఫేక్​ రుణాల యాప్‌లు.. అదుపులో నిందితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.