తిరుగుబాటు బలగాలకు, ప్రభుత్వ అనుకూల దళాలకు మధ్య సిరియాలో జరిగిన ఘర్షణలో 27 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. సిరియాలోని తిరుగుబాటుదారులకు టర్కీ దళాల మద్దతుంది. సిరియాకు వాయువ్యంగా ఉన్న ఇడ్లిబ్ రాష్ట్రంలో ఈ ఘర్షణలు తలెత్తాయి.
మృతులు వీరే...
మరణించిన వ్యక్తుల్లో.. 11 మంది ప్రభుత్వ దళాల సైనికులు, 14 మంది తిరుగుబాటుదారులు, మరో ఇద్దరు టర్కీ సైనికులు ఉన్నట్లు 'సిరియా మానవహక్కుల అబ్జర్వేటరీ' వెల్లడించింది. తమ దేశ సైనికులు మృతి చెందినట్లు టర్కీ కూడా ధ్రువీకరించింది. ఇడ్లిబ్‌లోని నాయ్‌రాబ్ ప్రాంతాన్ని తిరుగుబాటుదారులు తమ అధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
టర్కీ దళాలు సారాకేబ్ పట్టణంపై కూడా కాల్పులు జరిపినట్లు సిరియా మానవహక్కుల అబ్జర్వేటరీ వెల్లడించింది.
ఇదీ చదవండి: 91 మంది శరణార్థులతో సముద్రంలో నౌక గల్లంతు