ETV Bharat / international

పట్టాలు తప్పిన రైలు- 32 మంది మృతి - ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు

ఈజిప్టులో ఓ ప్యాసింజర్​ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 32 మంది మరణించారు. మరో 100 మందికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Passenger train derails in Egypt
పట్టాలు తప్పిన రైలు
author img

By

Published : Apr 18, 2021, 10:00 PM IST

ఈజిప్టు క్వాల్​యూబియా ప్రాంతంలో ఓ ప్యాసింజర్​ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 32 మంది మరణించారు. మరో 109 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడినవారిని 60 అంబులెన్సుల్లో స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు వైద్యశాఖ పేర్కొంది.

రైలు ఈజిప్టు రాజధాని కెయిరో నుంచి నైలు డెల్టా నగరానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. చాలా మంది ప్రయాణికులు బోగీల్లో చిక్కుకున్నట్లు అధికారులు వివరించారు. సహాయక చర్యలను చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

గత వారం ఈజిప్టులోని మిన్యా ఆల్ క్వామా ప్రాంతంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి.

ఇదీ చదవండి : 'నా భర్తకు ఓటేయొద్దు.. అతని క్యారెక్టర్ మంచిది కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.