ETV Bharat / international

అసలే కరోనా.. ఆపై బాంబుల మోత

అటు కరోనా సంక్షోభం.. ఇటు ఇజ్రాయెల్​ దాడులతో గాజా ప్రాంతం గజగజ వణికిపోతోంది. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థ.. తాజా పరిణామాలతో అత్యంత దారుణ స్థితిని ఎదుర్కొంటోంది. రాకెట్​ దాడుల్లో గాయపడి ఎందరో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. తెగిపడిన అవయవాలు, శరీరం నిండా రక్తంతో ఆసుపత్రి పడకల మీద పడుతున్నారు. వీరికి చికిత్స అందించలేక వైద్యులు విలవిలలాడుతున్నారు. రాకెడ్ దాడుల్లో గాయపడిన వారికి చికిత్స అందించడానికి కరోనా రోగులనే ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి ముగింపు ఏంటి? అని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Gaza, Gaza news
గాజా, గాజాపై రాకెట్ దాడులు
author img

By

Published : May 14, 2021, 5:02 PM IST

Updated : May 14, 2021, 7:33 PM IST

అసలే కరోనా.. ఆపై బాంబుల మోత

పాలస్తీనా-ఇజ్రాయెల్​ మధ్య అనాదిగా ఉన్న వివాదం మళ్లీ తీవ్రమైంది. ఇరు దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో రాకెట్ దాడులతో గాజా వీధులు దద్దరిల్లుతున్నాయి. ఇవన్నీ గతంలో ప్రజలు అనుభవించినవే అయినప్పటికీ ఈసారి పరిస్థితులు వేరు. ఇప్పటికే కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న గాజా ఆరోగ్య వ్యవస్థ.. ఇజ్రాయెల్ దాడుల​ ధాటికి మరింత పతనమైంది. ప్రజలతో పాటు వైద్యులు కూడా అల్లాడిపోతున్నారు.

కరోనా సంక్షోభంలో..

Gaza, Gaza news
గాజా, గాజాపై రాకెట్ దాడులు

కరోనా రెండో దశతో ఇటీవల గాజా విలవిలలాడింది. సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి చికిత్స అందించేందుకు వైద్యులు ఎంతో కష్టపడ్డారు. కొవిడ్​ కేసులు తగ్గి పరిస్థితి అదుపులోకి రావాలని డాక్టర్లు ప్రార్థించారు.

కానీ ఎవరూ ఊహించని రీతిలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా​ ఇప్పుడు యుద్ధం అంచున ఉన్నాయి. ఒక దేశంపై మరొకటి రాకెట్లు, బాంబులతో విరుచుకుపడుతున్నాయి. దాడుల్లో గాయపడిన అమాయకులు చికిత్స కోసం ఆసుపత్రులకు పరుగుల తీస్తున్నారు. ఇది అక్కడి వైద్యులను ఊపిరాడనివ్వకుండా చేస్తోంది.

Gaza, Gaza news
గాజా, గాజాపై రాకెట్ దాడులు

సాధారణంగా కొవిడ్​ బాధితుల కోసం ఆసుపత్రులు ఇతర సేవలను రద్దు చేస్తూ ఉంటాయి. కానీ గాజాలో మాత్రం.. దాడుల్లో గాయపడి ఆసుపత్రులకు వస్తున్న వారి కోసం కరోనా రోగులను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. ఆ ప్రాంతంలో పరిస్థితులను వివరించడానికి ఈ ఘటనలు చాలు.

Gaza, Gaza news
రాకెట్ దాడుల ఉపగ్రహ చిత్రం
Gaza, Gaza news
గాజాపై రాకెట్ దాడులు

గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి షిఫాకు.. అవయవాలు తెగిపడి, శరీరమంతా రక్తం కారుతున్న స్థితిలో రోజూ అనేకమంది వస్తున్నారు. కరోనా రోగులకు వైద్యం అందించేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వైద్యులు తిరిగొచ్చి... ఇప్పుడు తల, శరీరానికి తగిలిన గాయాలకు చికిత్స అందిస్తున్నారు.

"షిఫాకు వస్తున్న బాధితుల్లో ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉంటోంది. వీరిలో చిన్నా, పెద్దా, మహిళలు ఉన్నారు. చిన్న పిల్లల కాళ్లు, చేతులు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొందరు అసలు అవేవీ లేకుండానే ఆసుపత్రిలో చేరుతున్నారు. కాలేయం, పేగుల్లో గాయాలు అయ్యి కొందరు చిన్నారులు ఇక్కడ చేరారు. పరిస్థితి చాలా విషమంగా ఉంది."

--- డా. మహమ్మద్​ అబు సెల్మియా, షిఫా ఆసుపత్రి డైరక్టర్​.

రాకెట్​ దాడుల్లో ఇప్పటికే పలు ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి. అందువల్ల ఎప్పుడు ఏ బాంబు తమ మీద వచ్చి పడుతుందో తెలియక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు డాక్టర్లు.

టీకాలు వృథా!

ఈ కరోనా కాలంలో టీకాలను జీవనాధారంగా పరిగణిస్తున్నాయి అనేక దేశాలు. గాజాలో మాత్రం అవి వృథాగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది. అక్కడికి ఇటీవలే టీకాలు చేరుకున్నాయి. కానీ ఉద్రిక్తతల మధ్య అవి నిల్వ ఉన్న ఆరోగ్య కేంద్రాలు మూతపడ్డాయి. కొన్ని వారాల్లో టీకాలపై ఉన్న గడువు ముగిసి అవి పనికిరాకుండా పోతాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా సోకితే కోలుకునే అవకాశమైనా ఉందని, వీధుల్లో నడుస్తున్నప్పుడో, ఇంట్లో కుర్చుని భోజనం చేస్తున్నప్పుడో రాకెట్​ బాంబులు వచ్చి మీదపడితే ప్రాణాలు ఉంటాయా? అని గాజా ప్రజలు రోజూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

ఇదీ చూడండి: చైనాలో మతపరమైన వివక్షపై అమెరికా ఫైర్

Last Updated : May 14, 2021, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.