ETV Bharat / international

'పెగసస్​' దుర్వినియోగంపై చర్యలు- ఆ దేశాలపై నిషేధం!

పెగసస్​ స్పైవేర్​ దుర్వినియోగంపై ఆరోపణల నేపథ్యంలో అంతర్గతంగా దర్యాప్తు చేపట్టిన ఇజ్రాయెల్​ ఎన్​ఎస్​ఓ సంస్థ.. చర్యలు చేపట్టింది. ఈ స్పైవేర్​ను వినియోగిస్తున్న పలు దేశాల ఏజెన్సీలను తాత్కాలికంగా బ్లాక్​ చేసింది. మరోవైపు.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆరోపణల్లో పెగసస్​ పాత్ర లేదని పునరుద్ఘాటించింది. ప్రభుత్వ దర్యాప్తునకు ఎన్​ఎస్​ఓ పూర్తి సహకారం అందించినట్లు తెలిపింది.

Israel's NSO blocks some government clients
'పెగసస్​' దుర్వినియోగంపై చర్యలు
author img

By

Published : Jul 31, 2021, 4:15 PM IST

'పెగసస్​'.. ప్రస్తుతం భారత్​తో పాటు ప్రపంచాన్ని కుదిపేస్తోన్న అంశం. ఈ స్పైవేర్​ దుర్వినియోగంపై ఆరోపణలతో దాని మాతృ సంస్థ అయిన ఇజ్రాయెల్​కు చెందిన ఎన్​ఎస్​ఓ గ్రూప్​ చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ స్పైవేర్​ను వినియోగిస్తోన్న పలు దేశాల్లోని క్లయింట్లను తాత్కాలికంగా బ్లాక్​ చేసినట్లు అమెరికా మీడియా తెలిపింది.

ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిన మీడియా సంస్థల కన్సార్టియం.. స్పైవేర్​ను ఉపయోగించి హ్యాకింగ్​, ఫోన్ల ట్యాపింగ్​, నిఘా కోసం ఉపయోగించినట్లు నివేదిక సమర్పించింది. ఈ దర్యాప్తును అనుసరించే పలు దేశాలను బ్లాక్​ చేసినట్లు తెలుస్తోంది. 'కొందరు వినియోగదారులపై దర్యాప్తు జరిగింది. అందులో కొందరిని తాత్కాలికంగా బ్లాక్​ చేశారు.' అని ఇజ్రాయెల్​ సంస్థ ఎన్​ఎస్​ఓలోని ఓ ఉద్యోగి తెలిపినట్లు నేషనల్​ పబ్లిక్​ రేడియో(ఎన్​పీఆర్​) వెల్లడించింది. అయితే.. ఏ ప్రభుత్వాలు, దేశాలు అనేది బయటకి చెప్పలేదని తెలిపింది.

ఈ స్పైవేర్​ లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన కొన్ని ఫోన్​ నంబర్లను పరిశీలిస్తూ.. అంతర్గతంగా దర్యాప్తు చేపడుతోంది ఎన్​ఎస్​ఓ. ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించామని, ఆ ఫోన్లతో పెగసస్​కు ఎలాంటి సంబంధం లేదని తేలినట్లు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అయితే.. పెగసస్​ దుర్వినియోగం అయిందనే అంశాన్ని కప్పిపుచ్చుతున్నారా? అనే ప్రశ్నకు సమాధానమివ్వకపోవటం గమనార్హం. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

ఎన్​ఎస్​ఓపై ఇజ్రాయెల్​ దర్యాప్తు..

పెగసస్​ స్పైవేర్​ను ఇతర దేశాలకు విక్రయించటాన్ని నియంత్రించినప్పటి నుంచి ఇజ్రాయెల్​ ప్రభుత్వం సైతం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. తాజాగా ఈ వ్యవహారం బయటకి వచ్చిన క్రమంలో.. ఎన్​ఎస్​ఓపై దర్యాప్తు చేపట్టింది ఇజ్రాయెల్​ సర్కారు. ఆ దేశంలోని టెల్​ అవివాకు సమీపంలోని హెర్​జ్లియాలోని ఎన్​ఎస్​ఓ కార్యాలయాన్ని అధికారులు గత బుధవారం తనిఖీ చేశారు. సంస్థ పాత్రపై వచ్చిన ఆరోపణల మేరకే తనిఖీ చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ దర్యాప్తునకు ఎన్​ఎస్​ఓ పూర్తి సహకారం అందించినట్లు తెలిపింది. మీడియా కథనాల్లో వచ్చిన పేర్లు పెగసస్​ లక్ష్యం కాదనే అంశాన్ని నిరూపించాలని డిమాండ్​ చేసింది.

బ్లాక్​ చేసిన దేశాలు ఇవేనా?

తమకు 40 దేశాల్లో 60 మంది వినియోగదారులు ఉన్నట్లు ఎన్​ఎస్​ఓ తెలిపింది. వారంతా నిఘా సంస్థలు, మిలిటరీ, పోలీసు విభాగాలుగా పేర్కొంది. తాజాగా బయటపడిన మీడియా కథనాలకన్న ముందే.. కొద్ది రోజుల క్రితం ఐదు ప్రభుత్వ ఏజెన్సీలను స్పైవేర్​ దుర్వినియోగం నేపథ్యంలో బ్లాక్​ చేసినట్లు గుర్తు చేసింది.

మరోవైపు.. పెగసస్​ స్పైవేర్​ వినియోగించకుండా బ్లాక్​ చేసిన దేశాల్లో సౌదీ అరేబియా, యూఏఈలో దుబాయ్​, మెక్సికోలోని కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉన్నట్లు వాషింగ్టన్​ పోస్ట్​ తెలిపింది.

ఇదీ చూడండి: పెగసస్​ వ్యవహారంపై ఇజ్రాయెల్​ దర్యాప్తు షురూ ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.