ETV Bharat / international

ఇజ్రాయెల్​ భీకర దాడులు- 'ఉగ్ర సొరంగాలు' ధ్వంసం - air strikes

పాలస్తీనాలోని హమాస్​ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్​ దాడులు కొనసాగిస్తోంది. సోమవారం ఉదయం జరిపిన వైమానిక దాడుల్లో.. గాజాలోని 9 మంది హమాస్​ ఉగ్రవాదుల ఇళ్లు, ఉగ్ర శిబిరాలు ధ్వంసం అయ్యాయి. దీనిని అత్యంత భయంకరమైన దాడిగా పేర్కొంటున్నారు స్థానికులు. ఈ సంఘర్షణకు తక్షణమే ముగింపు పలకాలని ఇరు వర్గాలకు పిలుపునిచ్చారు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​. అమెరికా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరింది చైనా.

Gaza tunnels
వైమానిక దాడులు
author img

By

Published : May 17, 2021, 5:57 PM IST

పరస్పర దాడులతో ఇజ్రాయెల్​- పాలస్తీనాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్​ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలోని 9 మంది హమాస్​ ఉగ్రవాదుల ఇళ్లు, సొరంగాలు ధ్వంసమయ్యాయి. ఎంతమంది చనిపోయారన్నది స్పష్టత లేదు.

ఇజ్రాయెల్​ దాడులకు గాజా నగరం ఉలిక్కిపడింది. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటినుంచి ఇంత పెద్ద ఘర్షణలు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందటి వాటితో పోలిస్తే.. ఇవాళ జరిపిన దాడులు భీకరమైనవిగా అభిప్రాయపడుతున్నారు.

ఈ దాడులపై 10 నిమిషాల ముందే ఇజ్రాయెల్​ సైన్యం నుంచి సైరన్​ వచ్చింది. అప్రమత్తమైన ప్రజలు.. తమ నివాసాలను ఖాళీ చేయగా ప్రాణనష్టం తప్పింది. ఓ మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఎక్కువ భాగం రాకెట్లు.. వ్యవసాయ భూముల్లోనే పడినట్లు స్థానికులు తెలిపారు.

గాజా నగరంపై ఆదివారం జరిపిన వాయుదాడుల్లోనూ 42 మంది చనిపోయారు. మూడు ఎత్తైన భవనాలు నేలమట్టమయ్యాయి.

దాడులు ఇలాగే కొనసాగితే.. పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు గాజా మేయర్​.

ఐరాస హెచ్చరిక..

దాడులపై స్పందించిన ఐక్యరాజ్యసమితి.. గాజా భూభాగంలోని ఏకైక విద్యుత్​ కేంద్రంలో ఇంధనం అయిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గాజా వాసులు ఇప్పటికే విద్యుత్తు కోతతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.

గాజాకు మరో రెండు, మూడు రోజులు మాత్రమే విద్యుత్​ సరఫరా చేయగలుగుతామని వివరించారు విద్యుత్​ పంపిణీ కేంద్రం అధికారులు. ఇజ్రాయెల్​ దాడులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిందని తెలిపారు.

  • ఇప్పటివరకు ఇజ్రాయెల్​ దాడుల్లో.. 198 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఇందులో 58 మంది చిన్నపిల్లలు, 35 మంది మహిళలు. మరో 1300 మందికిపైగా గాయాలయ్యాయి.
  • గాజా రాకెట్​ దాడుల్లో.. ఇజ్రాయెల్​కు చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఐదేళ్ల బాలుడు సహా ఓ సైనికుడు ఉన్నారు.

అత్యవసర సమావేశం..

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య నెలకొన్న హింసపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ) అత్యవసర సమావేశమైంది. ఈ భేటీలో ఐరాస దౌత్యవేత్తలు, ఇస్లాం దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.

ఇజ్రాయెల్​ దళాలు​- గాజాలోని పాలస్తీనా ఉగ్ర దళాల మధ్య ఉద్రిక్తతలకు తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చింది యూఎన్​ఎస్​సీ. మండలి బహిరంగ చర్చలో మాట్లాడిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​.. ఈ సంఘర్షణను అత్యంత భయంకరమైనదిగా అభివర్ణించారు.

''సంఘర్షణ ముగిసిపోవాలి. ఇది తక్షణమే ఆగిపోవాలి. ఒకవైపు రాకెట్లు, మోర్టార్ల దాడులు.. మరోవైపు వైమానిక, ఫిరంగి దాడులు ఆగి తీరాల్సిందే. ఇందుకు సహకరించాలని ఇరు వర్గాలకు పిలుపునిస్తున్నా.''

- ఆంటోనియో గుటెరస్​, ఐరాస ప్రధాన కార్యదర్శి

ఇజ్రాయెల్​పై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడికి కొందరు డెమొక్రాట్లు సూచించినప్పటికీ.. బైడెన్​ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. సమావేశంలో పాల్గొన్న ఐరాసలోని అమెరికా రాయబారి.. ''దౌత్యమార్గాల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు బైడెన్​ సర్కార్​ అవిశ్రాంతంగా పనిచేస్తోంది'' అని అన్నారు.

ఇజ్రాయెల్.. గాజాపై చేస్తున్న దాడులను పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్​ ఆల్-మల్కీ తీవ్రంగా తప్పుబట్టారు. ఆ దేశం యుద్ధనేరాలకు పాల్పడుతోందన్నారు. జెరూసలెం నుంచి పాలస్తీనా ప్రజలను వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.

హింస ఆపాలి..

పౌరులపై హింసను చైనా తీవ్రంగా ఖండించింది. తక్షణమే వైమానిక, రాకెట్​ దాడులను ఆపాలని తేల్చిచెప్పింది.

గాజాలో సంఘర్షణను ఆపేందుకు.. అమెరికా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చైనా కోరింది. రక్తపాతానికి చరమగీతం పాడేందుకు ఐరాసలో చేస్తున్న డిమాండ్​ను అడ్డుకునే ప్రయత్నాలను ఆపాలని స్పష్టం చేసింది.

పరిస్థితులు సద్దుమణిగేందుకు.. అమెరికా తన బాధ్యత నిర్వర్తించాలని, భద్రతా మండలికి మద్దతు ఇవ్వాలని తెలిపారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్​.

ఇజ్రాయెల్​ సంయమనం పాటించాలని, దాడులు చేయడం ఆపాలని చైనా స్పష్టం చేసింది. యథాతథస్థితిని కొనసాగించాలని పిలుపునిచ్చింది.

ఇదీ చూడండి: వారికే.. విదేశీ ప్రయాణాలకు సౌదీ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.