ETV Bharat / international

'హమాస్'​పై ఈజిప్ట్​- ఇజ్రాయెల్​ విస్తృత చర్చలు! - గాజా

ఇజ్రాయెల్​, గాజాలోని హమాస్(Hamas)​ ఉగ్రవాదుల మధ్య వివాదం సద్దుమణిగేలా శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు చేపట్టింది ఈజిప్ట్​. ఈ క్రమంలోనే ఇరు దేశాల్లో ఆదివారం ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. ఇజ్రాయెల్​ విదేశాంగ మంత్రి ఈజిప్ట్​లో పర్యటించగా.. ఈజిప్ట్​ నిఘా విభాగం అధిపతి ఇజ్రాయెల్​ ప్రధానితో భేటీ అయ్యారు.

Egypt, Isreal
ఈజిప్ట్​, ఇజ్రాయెల్
author img

By

Published : May 30, 2021, 9:30 PM IST

ఇజ్రాయెల్​, హమాస్​(Hamas) మధ్య ఇటీవల 11 రోజుల పాటు జరిగిన మారణహోమం యావత్​ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసింది. ఈ దాడుల్లో గాజా తీవ్రంగా నష్టపోయింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్​, హమాస్​ ఉగ్రవాదుల మధ్య సంధి, గాజా పునర్నిర్మాణం కోసం కృషి చేస్తోంది ఈజిప్ట్​. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్​, ఈజిప్ట్ మధ్య ఇరుదేశాల్లో ఆదివారం ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. ​

ఆదివారం.. ఈజిప్ట్​లో పర్యటించారు ఇజ్రాయెల్​ విదేశాంగ మంత్రి గబి అశ్కేనాజీ. కైరోలో ఆయనకు స్వాగతం పలికారు ఈజిప్ట్​ విదేశాంగ మంత్రి సమేహ్​ శుక్రి. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ, గాజా కాల్పుల విరమణ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

"2008 తర్వాత ఈజిప్ట్​లో తొలిసారి ఇజ్రాయెల్​ విదేశాంగ మంత్రి పర్యటిస్తున్నారు. కాల్పుల విరమణ, హమాస్​ అధీనంలోని ఇజ్రాయెల్​ సైనికుల పార్థివదేహాలు, పౌరుల విడుదల వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు," అని కైరోలోని ఇజ్రాయెల్​ రాయబార కార్యాలయం పేర్కొంది.

అంతకు ముందు కైరోలో దిగిన క్రమంలో ట్వీట్​ చేశారు ఇజ్రాయెల్​ విదేశాంగ మంత్రి గబి అశ్కేనాజీ. 'హమాస్​తో శాశ్వత కాల్పుల విరమణ ఏర్పాటు, గాజా పునర్నిర్మాణం, మానవతా సాయం వంటి అంశాలపై చర్చిస్తామని' పేర్కొన్నారు.

నేతన్యాహూతో ఈజిప్ట్​ నిఘా అధినేత భేటీ..

కాల్పుల విరమణ ప్రయత్నాల్లో భాగంగా ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యూహు.. జేరుసలేంలో ఈజిప్ట్​ నిఘా విభాగం అధినేత అబ్బాస్​ కమెల్​తో భేటీ అయ్యారు. సైనికుల భౌతికకాయాలు, పౌరులను తిరిగి తీసుకురావటం, హమాస్​ బలాన్ని పెంచుకోవటాన్ని నిరోధించటం వంటి అంశాలను లేవనెత్తినట్లు చెప్పారు ప్రధాని.

మరోవైపు.. హమాస్​ నేతలతో మాట్లాడేందుకు గాజా వెళ్లే ముందు పాలస్తీనా అధికారులతో కమెల్​ సమావేశమవుతారని ఈజిప్ట్​ తెలిపింది. పాలస్తీనా ప్రజలకు ఈజిప్ట్​ పూర్తి మద్దతు ఇస్తుందనే సందేశాన్ని ఆ దేశ అధ్యక్షుడు మహమౌద్​ అబ్బాస్​కు తెలియజేస్తారని పేర్కొంది.

ఇదీ చూడండి: కాల్పుల విరమణవైపు ఇజ్రాయెల్​- పాలస్తీనా అడుగులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.