ఇజ్రాయెల్- బహ్రెయిన్ దేశాలు అధికారికంగా దౌత్య సంబంధాలను కుదుర్చుకున్నాయి. అమెరికా ఉన్నతాధికారుల బృందం సమక్షంలో ఆదివారం ఇరు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఫలితంగా ఇజ్రాయెల్‌తో మైత్రి ఏర్పరుచుకున్న నాలుగో అరబ్ దేశంగా బహ్రెయిన్ నిలిచింది.
గత నెలలో.. అమెరికాలో జరిగిన భేటీలో ఈ ఒప్పందంపై ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి. తాజాగా.. ఆదివారం బహ్రెయిన్‌లో వీటిపై సంతకాలు చేశాయి. ఫలితంగా రానున్న నెలల్లో రాయబార కార్యాలయాలను ఇరు దేశాలు స్థాపించనున్నాయి.
అమెరికా ఆర్థిక శాఖ కార్యదర్శి స్టీవెన్ ముచిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకు జాతీయ భద్రతా సలహాదారు మెయిర్ బెన్షాబాత్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఇది ఓ చారిత్రక ఒప్పందమని బహ్రెయిన్ విదేశాంగమంత్రి అబ్దుల్లాతిఫ్ అల్ జయాని అభిప్రాయపడ్డారు.
యూఏఈ, బహ్రెయిన్‌తో ఇజ్రాయెల్ ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దౌత్యపరంగా విజయం సాధించినట్టు అయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చూడండి:-